Breaking: వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్ జగన్ కు లేఖ రాశారు
వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్ జగన్ కు లేఖ రాశారు. తనరాజీనామా లేఖను జగన్ కు పంపారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాజకీయాలకు దూరంగా...
అయితే తాను రాజకీయాలకు దూరంగా కొంత కాలం ఉండదలచుకున్నానని తెలిపారు. అదే సమయంలో వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో కూర్చుని కార్యకర్తలను ఆందోళనలు చేయాలని పిలుపునివ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఆందోళనలు చేస్తే ఎలా అనిఆయన ప్రశ్నించారు. కనీసం సమయంఇవ్వాలి అని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తాను అధికారంలో ఉండగా ఎలంటి అవినీతికి పాల్పడలేదని, కానీ గత ఎన్నికల్లో ప్రజలు ఎందుకు అలాంటితీర్పు ఇచ్చారో తెలియదని అవంతిశ్రీనివాస్ అన్నారు.