Chandrababu : కలెక్టర్ల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు;

Update: 2024-12-12 07:31 GMT
chandrababu, chief minister, key decision, collectors
  • whatsapp icon

రెండో రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నెల రెండవ శనివారంను స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ దినంగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించార. వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై దిశానిర్ధేశం చేశారు. రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.


ఈ అంశాలపై...

26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే సదస్సులో వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా ఎస్పీలతో సమావేశం కానున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now




Tags:    

Similar News