Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక..ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనిలేదు

Update: 2024-12-12 05:53 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ సమస్యల పరిష్కారంకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పనిలేకుండా సరికొత్త విధానాన్ని అమలులోకి తేనుంది. స్మార్ట్ గవర్నెన్స్ లో భాగంగా వర్చువల్ గా సేవలందించేందుకు సిద్ధమయింది. ఇక ఏ పని కావాలన్నా వాట్సాప్ ద్వారా సేవలను పొందేఅవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే వాట్సాప్ ద్వారా ప్రజలకు సేవలందించేందుకు మెటాతో ఈ యేడాది అక్టోబర్ 22వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. ఎక్కువ మంది మంది వాట్సాప్ వాడుతుండటంతో పాటు రోజూ ఒక్కొక్కరు సగటున 30 సార్లు వాట్సాప్‌ను సెల్ ఫోన్‌లో తెరుస్తున్నారు.ఎక్కువ మంది, ఎక్కువ సమయం వినియోగిస్తున్న తరుణంలో వాట్సాప్ ద్వారా విరివిగా సేవలందించడానికి వీలవుతుంది.



 


సులువైనపద్ధతిలో...
అత్యవసర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, మౌలిక వసతలు కల్పించే ప్రాంతంలో స్థానిక ప్రజలకు సమాచారం పంపడం, ఈ క్రాప్ లో నమోదైన రైతులు ఏ సమయంలో ఏ మందులు వాడాలనేదిపై కూడా సమాచారం అందించవచ్చు. పంట ఉత్పత్తులను విక్రయించేందుకు మార్కెటింగ్ కు సంబంధించి సమాచారాన్ని ముందే అందించడం ద్వారా రైతులను అప్రమత్తం చేయొచ్చు. వాట్సాప్ ద్వారానే సులభంగా పన్ను చెల్లింపులు చేయొచ్చు. వాట్సాప్ ద్వారా దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలను అందించవచ్చు. ఫేజ్-1లో 100 నుండి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆదాయ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్‌ లను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరవేయవచ్చు. వాట్సాప్ ద్వారా సేవలందించే వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తీసుకొస్తున్నారు.
వాట్సాప్ ద్వారానే సర్టిఫికెట్లు...
ఈ విధానం ద్వారా ఎటటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా వాట్సాప్ ద్వారా అవసరమైన సర్టిఫికేట్లను పొందవచ్చు. ఈ ప్రక్రియలో ఏదైనా సమస్యలు ఎదురైతే క్షేత్రస్థాయి నుండి కలెక్టర్లు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రపంచంలో యూఏఈ దేశంలో తప్ప మరేదేశంలోనూ ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధానం లేదు. యూఏఈ తర్వాత ఈ సేవలు తీసుకొస్తోంది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని నారా లోకేష్ తెలపిారు. Ap.gov.in సైట్ లో సమాచారం ఉంచుతారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగే పనిలేదు. నిజంగా ఇది సక్సెస్ అయితే మాత్రం ప్రజలకు వేగంగా, సులువుగా సేవలను అందించే ప్రక్రియ తొలిసారిదేశంలో ప్రారంభమయినట్లే. ఈ విధానంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now



Tags:    

Similar News