Rain Alert : అల్పపీడనం మరింత తీవ్రంగా మారిందిగా.. రెండు రోజులు కుమ్ముడే

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-12-12 03:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని అధకారులు తెలిపారు. ఈ ప్రభావంతో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడతాయాని తెలిపింది. నైరుతి బగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారడంతో అదే స్థాయిలో వర్షాలు పడతాయని తెలిపింది. ఈ తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక - తమిళనాడు వ ైపు పయనించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.



 


ఈ జిల్లాల్లో భారీ వర్షాలు...
భారీ వర్షాలు తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. అదే సమయంలో నెల్లూరు, కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు విరివిగా రెండు రోజులు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో రాయలసీమలోనూ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ సమయంలో వాగులు, నదులు దాటేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కూడా అధికారులు హెచ్చరించారు. అలాగే తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
తడిసిన ధాన్యాన్ని...
భారీ వర్షాలతో రైతులు ఇబ్బంది పడకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ రెండు రోజుల పాటు భారీ వర్ష సూచనతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, వీలయినంత వరకూ ధాన్యం ఎక్కువ శాతం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. సముద్రం వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రత్యేకంగా కోరారు. అయితే చేపల వేటపై ఎలాంటి నిషేధం మాత్రం విధించలేదు.




Tags:    

Similar News