వైసీపీకి మరో షాక్.. గ్రంథి శ్రీనివాస్ రాజీనామా
భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు
వైస్సార్సీపీ కి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఈరోజు ఇద్దరు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కొన్ని నిమిషాలతర్వాత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించి జెయింట్ కిల్లర్ గా నిలిచారు.
కారణాలు చెప్పకపోయినా...
గ్రంధి శ్రీనివాస్ 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అభ్యర్థిగా భీమవరం బరిలో నిలబడి జనసేన అభ్యర్థి పులవర్తి ఆంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. గ్రంథి శ్రీనివాస్ పార్టీని వీడతారని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.