రెయిన్ అలర్ట్ .. ఏపీకి భారీ వర్షాలు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది.;
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 7న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఈ నెల 9న పశ్చమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని చెప్పింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది
చేపల వేటకు...
ఆ ప్రభావంతో ఈ నెల 8వ తేదీ నుంచి రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సమయంలో 45 నుంచి 56 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.