Chandrababu : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు మూడు వేల భృతి కావాలంటే ఇలా చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిచేందుకు సిద్ధమయింది.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందిచేందుకు సిద్ధమయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించడంతో ప్రభుత్వం యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా ఖరారు చేసింది. ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అన్నది అభ్యర్థులు తమకు తాముగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అర్హతలు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సూపర్ సిక్స్ హామీల్లో నెలకు ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
యువతపై ఫోకస్...
అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. కేవలం మహిళలు, రైతులు మాత్రమే కాకుండా యువతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయింది. అందుకోసమే వీలయినంత త్వరగా నిరుద్యోగ భృతిని అందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు నిరుద్యోగులు తాము ఈ పథకానికి అర్హులమని తమంతట తాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. అన్నీ అర్హతలు పరిశీలించిన తర్వాత లబ్దిదారులను అధికారులు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే ఏపీలో ఉన్న నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతి చెల్లించనున్నారు.
అర్హతలివిగో...
1. వయసు : 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది.
2. విద్యార్హతలు: కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొంది ఉండాలి.
3. రాష్ట్ర పౌరులు: అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి.
4. ఇతర మార్గాల్లో ఆదాయం: అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు రూ. 10,000 కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి.
5. భూమి : అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతంలో 1500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండాలి.
6. ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి: అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి.
7. ఇతర పథకాలు: అభ్యర్థి మరే ఇతర ప్రభుత్వ నిరుద్యోగ భృతి పథకం నుండి లబ్ధిపొందకూడదు.
అవసరమైన డాక్యుమెంట్లు ఇవే :
1. ఆధార్ కార్డు: గుర్తింపు మరియు చిరునామా ప్రూఫ్.
2. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ :ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్లు
3. ఆడ్రస్ ప్రూఫ్: రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్
4. బ్యాంక్ ఖాతా వివరాలు: బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ కాపీ
5. రేషన్ కార్డు: కుటుంబ ఆదాయ సమాచారం.
ఆన్ లైన్ లో ధరఖాస్తు ఇలా...
ఈ పథకం కింద అర్హులైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://yuvanestham.ap.gov.in లో తమ పేర్లను నమోదు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్ సైట్ లోనే వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మరియు ఇతర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫారం లోని అన్ని వివరాలను పూర్తి చేసిన తర్వాతనే సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత, అభ్యర్థులుఅందుకున్న రశీదుతో పాటు అప్లికేషన్ ఐడీని భద్రం చేసుకోవాల్సి ఉంటుంది.
కార్యాలయానికి నేరుగా వెళ్లి...
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ను కూడా ఈ పథకం కింద చేసుకునే వీలుంది. దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. కార్యాలయంలో నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫారం పొందవచ్చు. న్ని అవసరమైన వివరాలు మరియు డాక్యుమెంట్స్ సమర్పించాల్సిఉంటుంది. ఫారం మరియు డాక్యుమెంట్స్‌ను కార్యాలయంలో ఇచ్చేయవచ్చు. తర్వాత వారి నుంచి అప్లికేషన్ అందినట్లు రిసీట్ తీసుకోండి. అలాగే దరఖాస్తు ఫారం ఐడీని కూడా తెలుసుకుని ఉంచండి. అధికారులు డాక్యుమెంట్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత అర్శత కలిగిన వారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తారు. ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాల్లో నిరుద్యోగ భృతి జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.