తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్, నారా లోకేష్ దిగ్భ్రాంతి

అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు;

Update: 2025-01-08 17:12 GMT

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తిరుపతిలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన తొక్కిసలాటలో నలుగురు భక్తులు మృతి చెందడం తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు తావివ్వకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.


Tags:    

Similar News