Amaravathi : జంగిల్ క్లియరెన్స్ తర్వాత అమరావతి ఇలా
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది;
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ఐదేళ్లుగా రాజధాని అమరావతిని పట్టించుకోక పోవడంతో ముళ్ల చెట్లు పెరిగి అస్తవ్యస్తంగా తయారయింది. కనీసం నిర్మాణాలను చేపట్టడానికి కూడా వీలు లేకుండా పోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలను స్వీకరించిన వెంటనే అమరావతి నిర్మాణంపై నిధుల సేకరణ పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన లభించింది. అలాగే ప్రపంచ బ్యాంకు, ఆసియన్ అభివృద్ధి బ్యాంకు నుంచి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.
36 కోట్లు వెచ్చించి...
దీంతో అమరావతి రాజధానిలో ముళ్ల చెట్లను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్ల రూపాయలను వెచ్చించింది. రాజధాని ప్రాంతాన్ని శుభ్రపర్చే విషయాన్ని తొలి ప్రయారిటీగా తీసుకుంది. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. దీంతో ఇప్పటివరకూ ముళ్ల కంపలు, పిచ్చి చెట్లతో చిన్నపాటి అడవిలా దర్శనమిచ్చిన ఆ ప్రాంతమంతా చూడచక్కగాకనిపిస్తోంది. ఇటు ప్రధాన రహదారులు, ఇతరనిర్మాణాలకు టెండర్లను సైతం డిసెంబర్లోపు ఖరారుచేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణాలను కొనసాగించడానికి అనువైన వాతావరణం ఏర్పరిచింది. ఇక టెండర్లు పిలవడమే తరువాయి.