Andhra Pradesh : రోడ్లు ఓకే.. కానీ సర్టిఫికెట్లు ఏంది సామీ?

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు బాగవుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి రహదారులను మరమ్మతులు చేస్తుంది.;

Update: 2025-01-04 07:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు బాగవుతున్నాయి. కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి రహదారులను మరమ్మతులు చేస్తుంది. ఇందులో ఫస్ట్ మార్క్ గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వానికి వేయచ్చు. రహదారుల మరమ్మతుల కోసం దాదాపు 840 కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం రోడ్లన్నీ బాగుపడుతున్నాయి. అంతవరకూ బాగానే ఉంది. కానీ క్షేత్ర స్థాయిలో జనం ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. చిన్నసర్టిఫికేట్ కావాలన్నాగతంలో మాదిరిగా కాదు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వకార్యాలయాల్లో పని జరగాలంటే లంచాలు ఇవ్వకతప్పనిపరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.




 


గత ప్రభుత్వంలో వాలంటీర్లు...
గత ప్రభుత్వ హయాంలో ఏ సర్టిఫికేట్ అవసరమైనా వాలంటీర్లు ఇంటికి తీసుకు వచ్చిఇచ్చే వారు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. ఉద్యోగులకు లంచాలు ముట్టచెప్పే అవకాశం కూడా గత ప్రభుత్వంలో లేదు. ప్రజలకు కూడా గత ఐదేళ్ల నుంచి అది అలవాటయింది. కుల ధృవీకరణ, ఆదాయపు పన్ను సర్టిఫికేట్, రేషన్ కార్డులు, విద్యుత్తు మీటరు కోసం దరఖాస్తులు, దివ్యాంగులు తీసుకునే సర్టిఫికేట్లు ఇలా.. అన్ని రకాల సేవలు ఇంటికే వచ్చేవి. వాలంటీర్లు ఇంటికి వచ్చిమరీ సర్టిఫికేట్లు ఇచ్చేవారు. పైసా ఖర్చు చేయకుండా, చెప్పులు అరిగిపోకుండా తమ పని సులువుగా జరిగిపోయేది. గత ప్రభుత్వం ఆ అలవాటు పడ్డారు జనాలు. తాము కోరిన రెండు, మూడు రోజుల్లోనే సర్టిఫికేట్లు అందేవి.

Full View

ఈ ప్రభుత్వ హయాంలో...
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసివేశారు. కేవలం పింఛన్ల పంపిణీని సచివాలయం ఉద్యోగులను ఉపయోగిస్తున్నారు. వాలంటీర్లు లేకపోవడంతో పాటు సంక్షేమ పథకాలను పొందాలంటే వివిధ రకాల సర్టిఫికేట్లు పొందాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కావాలంటే ఆదాయ ధృవీకరణ పత్రం పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. రేషన కార్డు అన్ని పథకాలకు ప్రామాణికం కావడంతో దానికి అపలయ్ చేసుకోవాల్సి ఉన్నందున డబ్బులు పెట్టినా సరైన సమయానికి రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. వాలంటీర్లు లేకపోవడంతో తాము నేడు అన్నిరకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ఏరియా వరకూ ప్రజలు వాపోతున్నారు. కొందరయితే అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి అర్హులైన వారికి అవసరమైన సర్టిఫికేట్లు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




Tags:    

Similar News