Andhra Pradesh : ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ నేటి నుంచే
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించ నుంది;
ఇంటర్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించ నుంది. విజయవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ పదోతరగతి విద్యార్థుల వరకూ మాత్రమే మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందించేది.
హాజరు శాతాన్ని...
పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు మధ్యాహ్న భోజనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావించి ఈ విధానాన్ని కళాశాలల్లోనూ ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించారు. నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now