Alla Nanni : టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు

Update: 2024-12-03 02:12 GMT

వైసీపీ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్లనాని నేడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆళ్ల నాని పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆళ్లనాని ఆయనను కలసి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించనున్నారు. వైసీపీ హయాంలో కీలకంగా ఉన్న ఆళ్లనాని కొన్నాళ్ల క్రితమే పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

జనసేనలో చేరాలనుకున్నా...
అయితే ఆయన జనసేనలోకి వెళతారని భావించారు. కానీ అనూహ్యంగా ఆళ్లనాని టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకత్వం కూడా అంగీకరించింది. ఏలూరు కేంద్రంగా రాజకీయ వ్యవహారాలు కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్న ఆళ్లనాని ఈరోజు టీడీపీలో అధికారికంగా చేరే అవకాశముంది. అయితే ఆళ్ల నానికిపార్టీలో ఏ విధమైన బాధ్యతలను అప్పగిస్తారన్నది మాత్రం చూడాల్సి ఉంది.


Tags:    

Similar News