మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి మృతి
ఆలూరుమాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మరణించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు;
ఆలూరుమాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మరణించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. 2009లో ఆలూరు ఎమ్మెల్యేగా నీరజా రెడ్డి గెలుపొందారు. భర్త మరణం తర్వాత ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో నీరజారెడ్డి భర్త హత్యకు గురి కావడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు.
బీజేపీ ఇన్‌ఛార్జిగా...
ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన వెంటనే కర్నూలు ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేదు. ఆమె మరణించారని వైద్యులు ధృవీకరించారు.