Ap Politics : కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ ఎన్నికలపై ఇంపాక్ట్ ఉండనుందా?

గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికలపై ఐదు నెలల పాలన పడే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Update: 2024-10-29 08:24 GMT

AP MLC elections

కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి నాలుగు నెలలు దాటింది. మరికొద్ది రోజుల్లో ఐదు నెలలు పూర్తికావస్తుంది. ఈలోపు గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ ఐదు నెలల పాలన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పడే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రెడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగిపోయింది. అయితే కూటమి పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబంబిస్తాయన్నది కొంత వాస్తవం.

బలంగా కూటమి...
నిజానికి ఈరెండు జిల్లాల్లో కూటమి బలంగా ఉంది. ఐదు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోనూ, ఇటు తూర్పు, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లోనూ కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 31 స్థానాలను, 34 స్థానాల్లోనూ కూటమి పార్టీలు విజయం సాధించాయి. వైసీపీ వాస్తవానికి అక్కడ జీరో స్థానాలను చేజిక్కించుకుంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లు వేరు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో అంతా యూత్ ఎక్కువగా ఉంటుంది. అయితే యువకుల ప్రయారిటీ ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని చెప్పక తప్పదు.
ఐదు నెలలవుతున్నా...
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలుపర్చకపోవడంతో కొంత అసంతృప్తి అయితే నెలకొంది. నిరుద్యోగ భృతి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్న అసంతృప్తి కూడా యువతలో ఉంది. ఐదు నెలల్లో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడలేదు. దీనికి తోడు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన వాటిని విస్మరించడంతో పాటు ప్రతిదీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కూడా కొంత కూటమి సర్కార్ కు నెగిటివ్ గా మారింది. అసలు కూటమి పార్టీల్లోనే ఉభయ గోదావరి జిల్లాల్లో వేరు కుంపట్లు నేతలు పెట్టుకోవడం కూడా ఈఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉండనుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
విద్యుత్తు ఛార్జీల పెంపుదల...
ఇక తాజాగా విద్యుత్తు ఛార్జీల పెంపుదల భారం కూడా ఈ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశముంటుందని భావిస్తున్నారు. విద్యుత్తు బిల్లులు పెంచబోమని చెప్పి అధికారంలోకి రాగానే ఇలా పెంచడం పట్ల కూడా పెదవి విరుస్తున్నారు. గత ప్రభుత్వంపై నెపం నెట్టినా ప్రజలు ఈ విషయాన్ని నమ్మేందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహం ప్రకారం వెళతారు. ఆయన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ స్ట్రాటజీని మారుస్తుంటారు. ప్రత్యర్థులను చిత్తు చేసేలా ఆయన వ్యూహాలుంటాయి. వైసీపీ ఇలాంటి ఎన్నికల్లో అనుభవం లేమితో కొంత ఇబ్బందులు పడుతుంది. దీంతో గెలుపు ఎవరిది అని చెప్పలేం కానీ, కూటమి ప్రభుత్వంపై ఏపీ వాసుల్లో కొంత అసహనం అయితే కనపడుతుందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News