కొడుకుకు బ్రెయిన్ డెడ్.. ఇద్దరి ప్రాణాలు కాపాడిన కుటుంబ సభ్యులు

అవయవదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి అవయవదానం మరో పునర్‌ జన్మ ఇచ్చినట్లయవుతుంది.

Update: 2023-10-01 06:20 GMT

అవయవదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి అవయవదానం మరో పునర్‌ జన్మ ఇచ్చినట్లయవుతుంది. ఇలాంటి సాయం చేసే గుణం ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. కోనసీమ జిల్లాలోని కాట్రేకోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన గవర శ్రీరాములు అలియాస్ రాంబాబు కుటుంబ సభ్యులు ఇలాంటి మంచి నిర్ణయం తీసుకుని అందరితో శభాష్‌ అనిపించుకున్నారు.

గత నెల 26న ముమ్మిడివరం బొండాయికోడు పెట్రోల్ బంక్ దగ్గర ప్యాసింజర్ ఆటో రాంగ్ రూట్లో వచ్చి బైక్ పై వెళుతున్న రాంబాబును ఢీకొట్టింది. దీంతో రాంబాబు కోమాలోకి వెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ణారించారు. దీంతో తీవ్ర విషాదంలోను ఆయన కుటుంబ సభ్యులు గొప్పమనస్సు చాటుకున్నారు. అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ట్రస్ట్ హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి.. కిడ్నీలను తీశారు. ఒకటి ట్రస్ట్ హాస్పిటల్‌లో రోగికి అమర్చారు. మరో కిడ్నీ విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చేందుకు కాకినాడ నుంచి తరలించారు. అవయవాదానికి ముందుకు వచ్చిన గవర రాంబాబు కుటుంబ సభ్యులను ట్రస్ట్ హాస్పిటల్ యాజమాన్యంతో పాటు పలువురు అభినందించారు.

Tags:    

Similar News