Chandrababu : మరో గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు.. అదేమిటో తెలిస్తే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించబోతున్నారు;

Update: 2024-10-24 05:24 GMT

chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే మరో గుడ్ న్యూస్ అందించబోతున్నారు. అయితే ఈ ప్రకటన ఆయన నేరుగా చేసే అవకాశాాలున్నాయి. మంత్రుల సమావేశంలో ఈ విషయమై సూత్ర ప్రాయంగా చర్చించినట్లు తెలిసింది. దీంతో ప్రకటన ఎప్పుడు వెలువడేది తెలియరాకున్నా ఖచ్చితంగా త్వరలోనే ప్రకటన వస్తుందన్న అంచనాలు పార్టీ నేతల నుంచి వినపడుతున్నాయి. 2027 నాటికి జమిలి ఎన్నికలు వస్తాయని దాదాపుగా తేలడంతో వరసగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పర్చకుంటూ ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే పింఛను అమలు చేశారు. దీపావళికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తారు.

ఉచిత బస్సు కూడా...
ఇక త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మహిళలకు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఖర్చు విషయంలో కొంత వెనకడుగు వేస్తున్నప్పటికీ మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీ కావడంతో అది ఈ ఏడాది పూర్తి చేయాలన్న నిర్ణయంతో ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తులు అన్నీ పూర్తయ్యాయి. నెలకు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం చెల్లించాల్సి ఉంటుంది. అది పెద్దగా భారం కాకపోవచ్చని భావిస్తున్నారు. మద్యం దుకాణాల ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు మరికొంత ఆదాయాన్ని ఆర్జించే పనిలో ఆర్థిక శాఖ అధికారులు రేయింబవళ్లూ పనిచేస్తున్నారు.
ప్రభుత్వోద్యోగులకు...
ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వోద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఈ వరాలు ఉంటాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, గత ప్రభుత్వం గద్దె దిగడానికి ప్రభుత్వ ఉద్యోగులే కారణమని ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉద్యోగులను మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వారి నుంచి డిమాండ్లు ఇంకా రాకపోయినా వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది. డీఏ, టీఏలను పెంచుతూ త్వరలోనే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలిసింది. దీనిపై చంద్రబాబు కసరత్తులు ప్రారంభించారని చెబుతున్నారు.


Tags:    

Similar News