చెవిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది;

Update: 2025-01-10 06:25 GMT

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన క్వాష్ పిటీషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై ఇటీవల తిరుపతి పోలీసులు పోక్స్ కేసు నమోదు చేశారు. గతంలో బాలికపై అత్యాచారం జరిగిందని అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదులు రావడంతోదీనిపై చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

క్వాష్ పిటీషన్ పై...
అయితే తనపై నమోదయిన పోక్సో కేసును కొట్టివేయాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు శుక్రవారం ఆ పిటీషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇదే కేసులో బాలిక తండ్రి మాత్రం తన కుమార్తెపై చెవిరెడ్డి ఎలంటి దుష్ప్రచారం చేయలేదని, తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.


Tags:    

Similar News