Chandrababu : నేడు తిరుపతికి ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతికి వెళ్లనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తిరుపతికి వెళ్లనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.40 గంటలకు తిరుపతికి చేరుకుని పలు కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తిరుచానూరులో ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని అధికారికవర్గాలు వెల్లడించియా.
నారావారిపల్లిలో మూడు రోజులు...
తిరుపతిలో పర్యటన పూర్తయిన తర్వాత ఆయన తన స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుంటారు. సంక్రాంతి మూడు రోజుల పాటు నారావారాపల్లిలోనే చంద్రబాబు ఉండనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన అక్కడే పండగ జరుపుకుంటారు. నారావారిపల్లిలో ఎన్ టి అర్ విగ్రహావిష్కరణ,బ్యూటిపికేషన్,సబ్ స్టేషను శంఖుస్థాపన ,రహాదారుల నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమలను ముఖ్యమంత్రి చేయనున్నారు.