Tirumala : పరకామణిలో బంగారం దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
తిరుమలలో భక్తులు కానుకగా సమర్పించిన బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు.;
తిరుమలలో భక్తులు కానుకగా సమర్పించిన బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. పరకామణిలో చోరికి పాల్పడుతున్న అగ్రిగోస్ ఉద్యోగి పెంచలయ్య ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీవారి హుండీలో నగదుతో పాటు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బంగారు, వెండి నగలను కూడా వేస్తారు.
పైపులో పెట్టుకుని...
అందులో కొంత బంగారాన్ని దొంగిలిస్తూ ఉద్యోగి పెంచలయ్యపట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. పరకామణి నుంచి వచ్చేటప్పుడు ట్రాలీ పైప్ లో వంద గ్రాముల బంగారాన్ని పెట్టుకొని అలయంలోకి వస్తుండగా రెడ్ హ్యాండెండ్ గా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. విచారణ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. అతనికి ఎవరు సాయం చేశారన్న దానిపై విచారణ చేస్తున్నారు.