అల్లూరి జిల్లాలో చిరుత పులి... అలర్ట్ అయిన అటవీ శాఖ
అల్లూరి జిల్లాలో చిరుత కనిపించింది. జీకే వీధిలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు;
అల్లూరి జిల్లాలో చిరుత కనిపించింది. జీకే వీధిలో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఉదయం చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు వచ్చి పాదముద్రలను చూసి దానిని చిరుత పులిగా గుర్తించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఎవరూ రావద్దంటూ...
రాత్రి వేళ ఒంటరిగా ఈ దారిలో ప్రయాణించవద్దంటూ అధికారులు సూచించారు. చిరుత పులి ఇక్కడే సంచరిస్తుందని, అది మళ్లీ వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే ప్రజలు తమకు తాముగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరారు. ఎవరూ పశువులను ఒంటరిగా తీసుకుని వెళ్లవద్దంటూ కూడా అధికారులు హెచ్చరించారు.