Pawan Kalyan : ఐదు లక్షల విలువైన పుస్తకాలను కొనుగోలు చేసిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టం.;

Update: 2025-01-12 04:04 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టం. ఆయన ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువ పుస్తకాలను చదువుతూ గడిపేస్తారు. అయితే ప్రస్తుతం విజయవాడలో బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. బుక్ ఫెస్టివల్ కు హాజరైన పవన్ కల్యాణ్ దాదాపు ఐదు లక్షల రూపాయల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు.

పిఠాపురం లైబ్రరీకి...
దాదాపు మూడు గంటలకు పైగానే బుక్ ఫెస్టివల్ లో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన అన్నిస్టాళ్లను సందర్శించి ఉపయోగపడే పుస్తకాలను కొనుగోలు చేశారు. అయితే ఈ పుస్తకాలను తాను చదువుకోవడానికి కొన్ని అయితే, ఎక్కువ భాగం లైబ్రరీకి ఇస్తానని తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న లైబ్రరీకి ఈ పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.


Tags:    

Similar News