జేసీ మరోసారి వార్నింగ్.. జేసీబీలో కూల్చేస్తా
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు.;
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. జేసీ నిత్యం వార్నింగ్ లు ఇస్తూ కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. మరోసారి ఆయన విడుదల చేసిన వీడియోతో మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి యాడికి వాసులకు వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
యాడికిలో ఆక్రమణలను...
ఆలయకుంటను కబ్జాచేసిన వారిని వదిలేది లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలను జేసీబీలతో పడగొడతానని హెచ్చరించారు. గత ఐదేళ్లలో అక్రమ కట్టడాలు చేపట్టారన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి రికార్డులు ఉంటే తీసుకుని రావాలని కోరారు. ఆక్రమించిన వారు ఏ పార్టీవారైనా ఉపేక్షించేది లేదంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.