Chandrababu : కుప్పం నియోజకవర్గంలో ప్రజలతో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతుంది.

Update: 2024-06-26 07:28 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఆర్ అండ్ బి అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. చంద్రబాబుకు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్దయెత్తున ప్రజలు తరలి వచ్చారు. మహిళలు, వృద్ధులు తరలిరావడంతో అందరి నుంచి చంద్రబాబు వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని స్వయంగా పరిశీలిస్తూ వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

పార్టీ నేతలతో ...
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రాలను అందించి వెంటనే పరిష్కరించాలని చంద్రబాబు ఆదేశించారు. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించేవి కాగా, మరికొన్నింటికి సమయం పడుతుందని అధికారులు వారికి వివరిస్తున్నారు. దీని తర్వాత చంద్రబాబు పార్టీనేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి బెంగళూరుకు చేరుకుని అక్కడి నుంచి బయలుదేరి విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు.


Tags:    

Similar News