Modi : ఇచ్చిన సమయాన్ని మించి కొనసాగుతున్న ఇద్దరి భేటీ.. ఆసక్తికరమే?
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు
ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. పార్లమెంటుకు వైసీపీ ఎంపీలతో కలసి వచ్చిన ఆయన కొద్ది సేపటి క్రితం ప్రధాని కార్యాలయంలోకి వెళ్లారు. ప్రధాని కార్యాలయం తొలుతు నలభై ఐదు నిమిషాలు సమయం ఇచ్చినప్పటికీ అంతకంటే ఎక్కువగానే వీరిద్దరి మధ్య భేటీ కొనసాగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నలభై ఐదు నిమిషాలు పాటు సాగాల్సిన సమావేశం గంటకు పైగా సాగుతుండటంతో రాజకీయ పరిణామాలపై కూడా చర్చించనున్నారని తెలిసింది.
సమానదూరం పాటించాలనేనా?
వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి సమానదూరం పాటించాలని బీజేపీ యోచిస్తుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల క్రితం చంద్రబాబుతో అమిత్ షా భేటీ కాగా, ఈరోజు జగన్ ను పిలిపించుకుని మాట్లాడటంతో అదే అనుమానాలకు తావిస్తుంది. ఎవరితో పాత్తు లేకుండా ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందా? ఎన్నికల ఫలితాల తర్వాత అలయన్స్ గురించి ఇద్దరి మధ్య చర్చ జరుగుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే రాష్ట్ర అభివృద్ధి పనుల కోసమే జగన్ మోదీని కలిశారన్న వైసీపీ నేతల వాదన బయటకు చెప్పుకోవడానికేనని, లోపల మాత్రం ఏపీ రాజకీయాలపై చర్చ జరిగి ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.