Breaking : 12న నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది. జాబ్ క్యాలెండర్ ను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు అందుకు సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా కొత్త గా నోటిఫికేషన్లను జారీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
జాబ్ క్యాలెండర్ ద్వారా...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మెగా డీఎస్సీని ప్రకటించింది. అయితే అభ్యర్థుల సూచన మేరకు ఇంకా డీఎస్సీని జరపలేదు. ఈ నెల 12వ తేదీన విడుదల చేసే జాబ్ క్యాలెండర్ లో మెగా డీఎస్సీ కి సంబంధించిన క్లారిటీ కూడా రానుందని తెలిసింది. దీంతో పాటు అనేక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now