సినీ ఇండ్రస్ట్రీపై చంద్రబాబు హాట్ కామెంట్
రాజకీయ కక్షలుండవని, అదే సమయంలో తప్పులు చేసిన వారిని వదిలిపెట్టనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
రాజకీయ కక్షలుండవని, అదే సమయంలో తప్పులు చేసిన వారిని వదిలిపెట్టనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నూతన ఏడాదిసందర్శంగా మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. సెకీ అంశం తనకు లడ్డూలాగానే కనిపిస్తుందని చంద్రబాబు అన్నారు. అమెరికా నుంచి పూర్తి స్థాయిలో రికార్డులు తనకు అందాల్సి ఉందని, అవి వచ్చిన తర్వాత మాత్రమే చర్యలుంటాయని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సినీ పరిశ్రమ రావడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అమరావతికి సినీ పరిశ్రమ వచ్చే అవసరం కూడా లేదని ఆయన అన్నారు. అక్కడ పరిశ్రమ వేళ్లూనుకోవడంతో ఇక్కడకు రావడం కష్టమని కడూా ఆయన అన్నారు.
సినీ పరిశ్రమపై...
అదే సమయంలో హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసి ఊరుకోనని, అమరావతికి మార్కెటింగ్ చేయడం కూడా అంతేఅవసరం అని ఆయన అన్నారు. సినీ పరిశ్రమను జగన్ నాశనం చేశారన్నారు. గతంలో ఏపీలో సినీ పరిశ్రమకు ఎక్కువ ఆదాయం వచ్చేదని, అయితే ఇప్పుడు సినీ ఇండ్రస్ట్రీ ప్రపంచానికి విస్తరించడంతో పరిశ్రమ ఇక్కడకు తరలి వచ్చే అవకాశం లేదని అన్నారు. ఏపీ కంటే హైదరాబాద్ లోనే ఎక్కువ మంది సినిమాలు చూస్తున్నారన్న చంద్రబాబు దాని గురించి ఆలోచించడం అనవసరమని తేల్చారు. అమరావతి విషయంలో మాత్రం తాను తగ్గనని, నిర్మించిసంపదను మరింత పెంచేలా కృషి చేస్తానని చెప్పారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now