Srisailam : శ్రీశైలంలో సర్శ దర్శనాలు నిలిపివేత
కొత్త ఏడాది తొలి రోజున శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొత్త ఏడాది తొలి రోజున శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేశారు. అదే సమయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత అభిషేకాలు రద్దు చేసినట్లు శ్రీశైలం ఆలయ అధికారులు తెలిపారు. కొత్త ఏడాది దేశంలో ఆలయాన్నీ ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి.
భక్తుల రద్దీ పెరగడంతో...
అదే సయమంలో శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొత్త ఏడాది తమకు ఇష్టదైవాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నారని ఆలయఅధికారులు తెలిపారు.