Chandrababu : దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కొత్త ఏడాది దుర్గమ్మ ఆశీస్సులు పొందేందుకు వచ్చిన చంద్రబాబుకు ఆలయ అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేరుగా దుర్గమ్మ సన్నిధికి వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
వేద ఆశీర్వచనాలు...
అనంతరం చంద్రబాబుకు ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందచేశారు. తీర్థప్రసాదాలను ఇచ్చారు. నూతన సంవత్సరం తొలి రోజు దుర్గమ్మ ఆశీస్సులను పొందేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ లైన్ లో భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. దుర్గమ్మ దర్శనం కోసం రెండు గంటల పాటు వెయిట్ చేసి భక్తులు దర్శించుకున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now