Chandrababu : కొత్త ఏడాది అందరి ఆశలు నెరవేరుస్తాం
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఆనంద, ఆరోగ్య జీవితం కలగాలని ఆకాంక్షించారు. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఏర్పడిందని, అందరి ఆశలు నెరవేర్చేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు తెలియజేశారు.
సంక్షేమంతో పాటు అభివృద్దిని...
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిని ఆవిష్కృతం చేశామన్న ఆయన, కొత్త పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు.. 2025 వేదిక కాబోతోందన్నారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారం చేస్తామని చంద్రబాబు తెలిపారు. 10 సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.