Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి?

తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కొత్త ఏడాది జనవరి 1వ తేదీ కావడంతో అధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు

Update: 2025-01-01 03:21 GMT

తిరుమలలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కొత్త ఏడాది జనవరి 1వ తేదీ కావడంతో అధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దీంతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గత ఏడాది తిరుమలకు అత్యధిక సంఖ్యలో ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానంఅధికారులు తెలిపారు. దాదాపు 1,240 కోట్ల రపాయల ఆదాయం గత ఏడాది వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గత ఏడాది తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారకిని దర్శించుకున్నారని అధికారులు లెక్కలు చెప్పారు. ఈ ఏడాది కూడా అత్యధిక మంది తిరుమలకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది హుండీ ఆదాయంతో పాటు లడ్డూ ప్రసాదాల విక్రయం కూడా బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా అధికంగా విక్రయాలు సాగుతాయని అధికారులు అంచనా లు వేస్తున్నారు. అదే సమయంలో తిరుమలలో భక్తులకు వసతి, భోజనాలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు కూడా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కొత్త ఏడాదిలో తిరుమలో ఆధ్మాత్మికత మరింత పెరిగేలా కృషి చేస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. భక్తులు నిరాశ చెందకుండా త్వరిగతిన దర్శనాలు పూర్తయ్యేలా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎనిమిది గంటల సమయం...
అదే సమయంలో తిరుమలలో క్యూ లైన్ లలో పెద్దగా వేచి ఉండకుండానే రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం అయ్యేలా చూస్తామని టీటీడీ అధికారులు హామీ ఇచ్చారు. తిరుమలలో బ్రాండెడ్ హోటల్స్ కు కూడా అనుమతివ్వడంతో వచ్చే యాత్రికులకు శుచికరమైన, రుచికరమైన ఆహారం లభిస్తుందని తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుందని చెప్పారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 62,495 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,298 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ నెల 10 వతేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News