మనది మనసున్న ప్రభుత్వమని జగన్ అన్నారు. మనసులేని వారు కొందరితో యుద్ధం జరగబోతుందన్నారు. నిరుపేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యర్థులు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ అన్నారు. త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పింది చెప్పినట్లు తాము అమలు చేశామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. మన ప్రభుత్వం వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్ అని జగన్ అన్నారు. మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని జగన్ కోరారు. మరో వైపు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్ మెంట్ స్కామ్, నీరు చెట్టు పేరుతో, జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ చేసిన వారిని కోరుకుంటారా? అని ప్రశ్నించారు.
వాహనమిత్ర ద్వారా...
వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఇప్పటి వరకూ పదమూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.వైఎస్సార్ వాహనమిత్ర అమలు చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. పథకాలన్నీ అవినీతికి తావులేకుండా చేస్తున్నామని చెప్పారు. 2,75,931 మంది లబ్దిదారులకు 275 కోట్ల రూపాయల నిధులను ఇప్పుడు జమ చేస్తున్నామని జన్ తెలిపారు. ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమచేస్తూ పారదర్శకతతో వ్యవహరిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పేదలకు తోడుగా ఉండేందుకే ఈ పథకాన్ని రూపొందించామని చెప్పారు.
అందరి ప్రభుత్వంగా...
ఇది జగనన్న ప్రభుత్వమని, మీ అందరి ప్రభుత్వమని చెప్పారు. అన్ని వర్గాలను ఆదుకుంటూ వెళుతున్నామని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులను ఆదుకుంటున్నామని చెప్పారు. వాహనమిత్రతో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు లబ్ది చేకూరుతుందన్నారు. 44 లక్షల మందికి అమ్మఒడి అమలు చేస్తున్నామని చెప్పారు. నేతన్నలకు కూడా సాయం అందిస్తూ ఈ ప్రభుత్వం అన్ని పేద వర్గాల ప్రజలను ఆదుకుంటుందని జగన్ తెలిపారు. ఎటువంటి అవినీతికి తావులేకుండా అమలు చేస్తున్నామని, పేదల కోసం పనిచేస్తున్న సర్కార్ మనది అని జగన్ అన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేసిందా? అని జగన్ ప్రశ్నించారు.
అన్ని రంగాలకు...
చిరు వ్యాపారులకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పేదలకు ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలను చేపడుతున్నామని జగన్ చెప్పారు. విద్యాదీవెన కింద పదకొండు వేల కోట్లు అందించామని చెప్పారు. వైఎస్సార్ కాపు నేస్తం కూడా అమలు చేస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. అందరికీ ఇంగ్గీష్ మీడియం చదువులు అందించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పేదలు ఉన్నతచదువులు చదువుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు.