శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే చర్యలు : జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు వద్ద ఆయన లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు.

Update: 2024-03-14 05:56 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు వద్ద ఆయన లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. హైదరాబాద్ కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తీర్మానించారని, కానీ అది సాధ్యం కాలేదని అన్నారు. తాము హైకోర్టును కర్నూలులో పెడతామని ఇదివరకే చెప్పామని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు.

లా యూనివర్సిటీతో పాటు...
అందుకే ఇక్కడ లా యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. లా యూనివర్సిటీ కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీ లీగల్ మెట్రాలజికల్ కమిషన్, లేబర్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డు, మానవ హక్కుల కమిషన్‌లను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లాకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News