Tirumala : తిరుమలలో నేడు భారీగా పెరిగిన రద్దీ.. ఎన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు వెయిటింగ్ తెలుసా?

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2024-12-25 03:17 GMT

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. బుధవారం అయినా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు ఒక్కసారిగా రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ ఎక్కువయింది. దీంతో అధికారులు అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రిస్మస్ సెలవులు కూడా రావడంతో ఒక్కసారిగా భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో తిరుమల వీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. తిరుమలలో భక్తుల దర్శనం త్వరగా పూర్తి కావడానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకంగా ఏ1 విధానం ద్వారా రెండుగంటల్లో భక్తులకు దర్శనం అయ్యేలా ప్రయోగాత్మకంగా దర్శనం అవుతుందా? లేదా? అన్నది పరిశీలించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే దీనిని కంటిన్యూ చేస్తారు. ముందుగా టోకెన్లు మంజూరు చేయడం తర్వాత వారిని నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించడం వంటివి చేయడం ద్వారా దర్శన సమయాన్ని తగ్గించవచ్చని చూస్తున్నారు. అయితతే ఇంకా ఈ ప్రయోగం ప్రాధమిక దశలోనే ఉంది. మరొక వైపు వచ్చే నెల నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి కూడా టిక్కెట్లు విడుదల కానుడండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి.

ఈ మాసం చివరలో...
తిరుమల అంటేనే డిసెంబరు మాసం కిటకిటలాడుతుంది. ఇయర్ ఎండింగ్ లో తమకు ఇష్టదైవమైన శ్రీవారిని దర్శించుకోవడం చాలా మందికి సంప్రదాయంగా వస్తుంది. అందుకే డిసెంబరు చివరి మాసంనుంచి వచ్చే నెల రెండో వారం వరకూ ఈ భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఉచిత దర్శనంలో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,708 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News