ఏపీలో ఈ రైళ్లు ఈ నెల 26వ తేదీ నుంచి రద్దు

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో ఈ నెల 26వ తేదీ నుంచి పలు రైళ్లు రద్దవుతున్నాయి

Update: 2024-12-25 03:02 GMT

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో ఈ నెల 26వ తేదీ నుంచి పలు రైళ్లు రద్దవుతున్నాయి. పలుచోట్ల భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో రైళ్లు రద్దు చేయనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ఈనెల 29న విశాఖ- బెనారస్‌ (18311), రౌర్కెలా- జగదల్‌పూర్‌- రౌర్కెలా (18107-1808), 30న బెనారస్‌- విశాఖ(18312) రైళ్లు రద్దు చేయనున్నట్లు తెలిపారు.

మార్చి వరకు పాసింజర్‌ రైళ్లు..
ఈనెల 26 నుంచి 28 వరకు రాజమహేంద్రవరం- విశాఖ (07466), విశాఖ- విజయనగరం (07468), 27 నుంచి మార్చి 1 వరకు విశాఖ- రాజమహేంద్రవరం (07467), విజయనగరం- విశాఖ (07469), విశాఖ- పలాస- విశాఖ (07470-07471) రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు కోరారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now




 

Tags:    

Similar News