Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఢిల్లీకి ఎందుకు దూరమయ్యారు? అసలు రీజన్ ఇదేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్టీఏలో భాగస్వామి. ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో యాక్టివ్ గా కనిపించారు.

Update: 2024-12-25 06:31 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్టీఏలో భాగస్వామి. ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో యాక్టివ్ గా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడటానికి కూడా ప్రధాన కారణం పవన్ కల్యాణ్. ఇక మోదీ, అమిత్ షాలతో పవన్ కల్యాణ్ కు నేరుగా సత్సంబధాలున్నాయి. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఢిల్లీకి పెద్దగా వెళ్లడం మానుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకసారి ఢిల్లీ వెళ్లి ప్రధానిని తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అదీ అక్కడి నుంచిపిలుపు వస్తేనే ఆయన హస్తిన పయనమై వెళుతున్నారు.

ఢిల్లీ పర్యటనలకు...
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సార్లు ఎన్డీఏ సమావేశాలు జరిగాయి. కానీ పవన్ కల్యాణ్ ఈ సమావేశాలకు హాజరయింది ఒకటి రెండు మాత్రమేనని చెప్పాలి. . ఒక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే హాజరయ్యారు. పవన్ కల్యాణ్ కు పిలుపు లేదా? లేక ఆహ్వానం ఉన్నా ఆయనే వెళ్లడం లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఎన్టీఏ సమావేశంలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ సమావేశాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అలాగని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆయన వ్యతిరేకం కాదు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి కూడా పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదనే తెలుస్తోంది. అయితే ఈరోజు కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే సమావేశానికి హాజరవుతున్నారని నేతలు చెబుతున్నారు.
ఎన్డీఏ సమావేశాలకు...
అయితే పవన్ కల్యాణ‌్ వ్యవహార శైలి అలాగే ఉంటుందని జనసేననేతలు పేర్కొంటున్నారు. ఆయన పెద్దగా చొరవ తీసుకుని వెళ్లి పలకరించరని, వారు పలుకరిస్తే మాత్రం మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన బీజేపీ పెద్దలతో టచ్ మి నాట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పవన్ తో పరోక్షంగా బీజేపీ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. బీజేపీ అగ్రనాయకత్వంతో దూరాన్ని పవన్ కల్యాణ్ మెయిన్ టెయిన్ చేయడం లేదు. అలాగే బీజేపీ కూడా పవన్ ను దూరం చేసుకోవాలన్న ఆలోచనలో లేదు. పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశానికి వెళ్లకపోయినా పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని, జనసేనను మిత్రపక్షంగా కాకుండా, సొంత పార్టీలాగానే కమలనాధులు చూస్తున్నారన్న టాక్ కూడా ఉంది.
రెండు పార్టీలదీ...
మరోవైపు పవన్ కల్యాణ్, బీజేపీలు ఏపీపై దూర దృష్టితో ఉన్నారు. భవిష్యత్ లో రెండు పార్టీలను బలోపేతం చేయడమే కాకుండా, విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నారు. పవన్ కల్యాణ్ వల్ల దక్షిణాదిన తమ కూటమి బలం పడుతుందన్నది బీజేపీ వ్యూహం కాగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో తన పార్టీని మరింతగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలన్నది పవన్ కల్యాణ‌్ స్ట్రాటజీ. రానున్న కాలంలో రాజకీయంగా ఏమి జరిగినా జనసేన, బీజేపీలు మాత్రం కలసి పనిచేయాలన్నదే ఇద్దరి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలు వీలయినంత తగ్గించడమే కాకుండా, ఎక్కువగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే పెద్దగా సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. జమిలి ఎన్నికల విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కల్యాణ్ అభ్యంతరం చెప్పే అవకాశం లేదు కనుక ఆయన వెళ్లకపోయినా పరవాలేదని పార్టీ నేతలు అంటున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 

Full View


Tags:    

Similar News