Chandrababu : ఢిల్లీలో నేడు చంద్రబాబు బిజీ బిజీ
ఈరోజు ఢిల్లీలో చంద్రబాబునాయుడు బిజి బిజీగా గడపనున్నారు.
ఈరోజు ఢిల్లీలో చంద్రబాబునాయుడు బిజి బిజీగా గడపనున్నారు. ఉదయం 8.30 కు మాజీ ప్రధాని ఆటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.
వరస భేటీలు...
అనంతరం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబునాయుడు కలవనున్నారు. ఎన్ డి ఎ సమావేశానంతరం మధ్యాహ్నాం రెండు గంటలకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి తో సమావేశం అవుతారు. 3.30 కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ తో భేటీ కానున్నారు. సాయంత్రం 4.30 ప్రధాని మోడీ తోనూ, సాయంత్రం 6.30 కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now