Ys Sharmila : రాహుల్, జగన్ మీటింగ్ పై షర్మిల ఏమన్నారంటే?

రాహుల్ గాంధీ, జగన్ కలుస్తారు అనే విషయంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-08-15 06:30 GMT

రాహుల్ గాంధీ, జగన్ కలుస్తారు అనే విషయంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. వారిద్దరూ కలుస్తారని ప్రచారం జరగడం అవాస్తవమని తెలిపారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించిన అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితం మనకు సిద్ధించిన స్వాతంత్ర్యం మహనీయులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు తెలుపుతున్నామని చెప్పారు. గత 10ఏళ్లుగా బీజేపీ ఈ దేశంలో అధికారంలో ఉందని, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, ప్రగతికి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. బీజేపీ మత తత్వ పార్టీ అని, బీజేపీ అరాచకాలు మనం 10 ఏళ్లుగా చూస్తున్నామని, హర్ ఘర్ తిరంగ అని మోడీ ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారని, దేశ భక్తి ఉన్నట్లు బీజేపీ సర్టిఫై చేస్తుందట అని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని, జాతీయ జెండాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ అవమానించిందని తెలిపారు. మూడు రంగుల జెండాను గౌరవించం అని చెప్పిందన్నారు.

దేశానికి మోడీ....
నిజానికి ఈ దేశానికి మోడీ చేసింది ఏమీ లేదన్న వైఎస్ షర్మిల హర్ గర్ ను మోడీ మోసం చేశారన్నారు. . ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అని మోసం చేశారని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని మోసం చేశారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటామని మోసం చేసింది మోడీ కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో హర్ గర్ దోకా చేశారన్న వైఎస్ షర్మిల మణిపూర్ లో ఊచ కోత కోశారన్నారు. ఆంధ్రలో కూడా ప్రతి ఘర్ ను మోసం చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేశారని, విభజన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఈరోజు దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తాం అని అంటున్నారని, ఇవ్వాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనుకుంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు.


Tags:    

Similar News