Pawan Kalyan : ఏడీబీ రోడ్డు పనులను పరిశీలించిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏడీబీ రోడ్డును పరిశీలించారు;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏడీబీ రోడ్డును పరిశీలించారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి ఆయన తన కాన్వాయ్ తో ఏడీబీ రోడ్డుమీదుగా పిఠాపురం పర్యటనకు బయలుదేరారు. దారి మధ్యలో రోడ్డు దుస్థితిని అధికారులను అడిగి పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. పిఠాపురం వెళ్లే మార్గంలో రామాస్వామి పేట వద్ద ఏడీబీ రోడ్డును ఆయన పరిశీలించారు.
పనులపై ఆరా...
నిర్మాణపనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఎంత వరకూ పనులు పూర్తయ్యాయి? ఎప్పుడు పూర్తవుతాయని అని అధికారులను ప్రశ్నించారు. రోడ్డు నాణ్యతను కూడా పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఇటీవల ఇదే రోడ్డులో రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు హాజరై ఇద్దరు యువకులు మరణించడంతో పవన్ కల్యాణ్ ఆరోడ్డు నుంచి ప్రయాణించి అధికారులను అప్రమత్తం చేశారు.