Leopard : గ్రామంలోకి చిరుతపులి.. కొండపైనే తిరుగుతూ

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది;

Update: 2025-01-10 07:59 GMT

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ముదిగల్లు గ్రామ శివారులో చిరుత కనిపించింది. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొందరు చిరుత సంచరించే దృశ్యాలను వీడియోలో బంధించారు. చిరుతపులి కొండ మీద తిరుగుతుండటంతో అది గ్రామంలోకి వస్తుందని భయపడిపోతున్నారు.

జాడ కోసం...
అయితే చిరుతపులి ఎక్కడ ఉన్నది అటవీ శాఖ అధికారులకు తెలియలేదు. దీంతో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళ గ్రామాల్లోకి వచ్చే అవకాశముందని, పెంపుడు జంతువులు, పశువులను బయట కట్టివేయద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. పులిని పట్టుకునే ప్రయత్నం జరిగేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.


Tags:    

Similar News