Breaking : జగన్ కు షాకిచ్చిన చంద్రబాబు.. ఆ పేర్లను మారుస్తూ ఉత్తర్వులు

వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ ఇచ్చారు;

Update: 2025-01-10 12:12 GMT

వైసీపీ అధినేత జగన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన జగనన్న కాలనీల పేర్లను తొలగించారు. దాని స్థానంలో పీఎంఎవై - ఎన్టీఆర్ నగర్ లుగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసింది.

గత ప్రభుత్వ హయాంలో...
పట్టణాలు, నగరాలకు శివార్లలో ప్రత్యేకంగా స్థలాలను సేకరించి అందులో ఒక్కొక్క లబ్దిదారుడికి మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించింది. దీనికి జగనన్న కాలనీలుగా నామకరణం చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ నగర్ గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News