Tirumala : టీటీడీ పాలకమండలి సమావేశం.. నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరిగింది.;

Update: 2025-01-10 11:51 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం నేడు జరిగింది. ఈ సమావేశంలో రెండు రోజుల క్రితం జరిగిన తొక్కిసలాటకు గల కారణాలపై చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించాలని పాలక మండలి నిర్ణయించింది. అలాగే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలపై కూడా సమావేశం చర్చించింది.

అనేక అంశాలపై...
ఇక నేడు జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించన అంశాలపై కూడా రివ్యూ చేసినట్లు సమాచారం. తిరుమల పవిత్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు ఏమేం తీసుకోవాలో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. సామాన్య భక్తులకు సులవుుగా దర్శనం కలిగించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా చర్చించింది.


Tags:    

Similar News