Pawan Kalyan : అధికారులను పరుగులు పెట్టిస్తున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కృష్టా జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కృష్టా జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు కంకిపాడు మండలం గుడువర్రు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెం గ్రామం చేరుకుంటారు. అక్కడ రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలించనున్నారు.
నేడు కృష్ణా జిల్లాలో....
పంచాయతీ రాజ్ శాఖ పనులపై నిత్యం సమీక్షలు చేస్తూ నేరుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ పనులను పరిశీలించడం పవన్ కల్యాణ్ తరచూ చేస్తుండటంతో పనులు వేగంగా పూర్తి కావడానికి దోహదడుతుంది. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి చెప్పిన సమయానికి పనులను పూర్తి చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. పవన్ నిత్యం పర్యటనలతోనే అధికారులను పరుగులు తీయిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now