Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిక్కెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదిక్షణం టోకెన్లను చేయనుంది
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన అంగప్రదిక్షణం టోకెన్లను చేయనుంది. ఉదయం పది గంటలకు ఆన్ లైన్ లో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ టిక్కెట్లన్నీ ఉచితంగానే జారీ చేస్తామని తిరుమల దేవస్థానం అధికారులు తెలిపారు.
రోజుకు 750 మందికి...
ప్రతి రోజూ 750 మందికి అంగప్రదిక్షిణం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపారు. ఒక్క శుక్రవారం మాత్రం ఈ టిక్కెట్లు అందుబాటులో లేవని టీటీడీ అధికారులు తెలిపారు. అంగప్రదిక్షిణం చేసిన భక్తులు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీవారి దర్శనం కల్పిస్తారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now