నేడు విశాఖకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
నేడు విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు.
నేడు విశాఖలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. విశాఖలోని సాగర్ మాల కన్వెన్షన్ సెంటర్ లో "రోజ్ గార్ మేళా" కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొంటరు. ఈ కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి రామ్మోహన్ నాయుడు ప్రసంగించనున్నారు. కేంద్ర మంత్రి విశాఖ పర్యటనకు వస్తుండటంతో పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎయిర్ పోర్టు పనులపై...
కేంద్ర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలను స్వీకరించిన తర్వాత వరసగా ఏపీలో పర్యటిస్తున్నారు. ఎయిర్ పోర్టుల మంజూరు విషయంలోనూ రామ్మోహన్ నాయుడు ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు పర్యటన సందర్భంగా రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో పురోగతి పై అధికారులతో చర్చించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now