Amaravathi : నేడు సీఆర్డీఏ సమావేశం.. అమరావతి పనులపై కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సీఆర్డీఏ సమావేశంలో అమరావతి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు

Update: 2024-12-23 01:49 GMT

 Andhra pradesh 



 

ఈరోజు సీఆర్డీఏ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అమరావతి పనులకు సంబంధించి కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. సీఆర్డీఏ 44వ అధారిటీ సమావేశంలో పలు పనులకు ఆమోనదం చేపట్టనున్నారు. ప్రధానంగా ఎల్బీఎస్, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు.

మరో రెండు వేల పనులను...
ఇప్పటికే 45 వేల కోట్ల రూపాయల విలువైన పనులను సీఆర్డీఏచేపట్టేందుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరో రెండువేల పనులకు సంబంధించి పనులను చేపట్టేందుకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది. వారానికి ఒకసారి సీఆర్డీఏ సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై చంద్రబాబు చర్చించాలని నిర్ణయించడంతో ఈ సమావేశాన్ని ప్రతి వారం ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ

Tags:    

Similar News