Andhra Pradesh : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-12-22 07:32 GMT

ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో అదనపు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం అయిన తర్వాత కొత్త ఉద్యోగాల నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. విశాఖలో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


త్వరలోనే ఉచిత బస్సు...
త్వరలోనే ఏపీలో ఉచిత మహిళ బస్సు పథకాన్ని ప్రారంభించనున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖలో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించిన రాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీలోకి 1400 కొత్త బస్సులు తెస్తున్నామని తెలిపారు. రెండు వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే ప్రయత్నంలో కూడా ఉన్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ

Tags:    

Similar News