వేసవిలో పెరగనున్న విద్యుత్తు డిమాండ్

వేసవిలో విద్యుత్తు డిమాండ్ అత్యధికంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది;

Update: 2025-01-29 02:35 GMT
electricity, demand , summer, andhra pradesh
  • whatsapp icon

వేసవిలో విద్యుత్తు డిమాండ్ అత్యధికంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. ఈ ఎండతీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ సూచనలతో విద్యుత్తు డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశముందని భావించిన ఏపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది.

విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని...
దీంతో విద్యుత్తు ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే జెన్ కో అధికారులను ఆదేశించారు. ఈ సారి పీక్ డిమాండ్ 13,700 మిలియన్ యూనట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దానికి తగినట్లు విద్యుత్తు ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. విద్యుత్తు కోతలు లేకుండా చూసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అందుకు కోసం అన్ని రకాలుగా సిద్ధమవ్వాలని ప్రభుత్వం జెన్ కో అధికారులను కోరింది.


Tags:    

Similar News