Chandrababu : పోలవరం నిర్వాసితులకు చంద్రబాబు గుడ్ న్యూస్
పోలవరం నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు;

పోలవరం నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు పోలవరం నిర్వాసితులకు మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం నిర్వాసితులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా పెరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే పోలవరం నిర్మాణం ఇప్పటికే పూర్తయి మీ జీవితాలు బాగుపడేవని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితులను కూడా పట్టించుకోలేదన్నారు. వాళ్ల హయాంలోనే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని తెలిపారు.
అందరికీ పునరావాసం...
2027 నాటికి పునరావాసం అందరికీ కల్పించాలన్న ఉద్దేశ్యమే తమ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణం కోసం తన హయాంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారన్నారు. ప్రాజెక్టుల కోసం భూముల ఇచ్చి ఎంతో త్యాగం చేశారన్నచంద్రబాబు మీకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020 నాటికి పోలవరం నిర్మాణం పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. దళారీల వ్యవస్థలేకుండా అందరికీ పరిహారం అందించామని చంద్రబాబు తెలిపారు.