ఏపీలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి వీరికి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ -2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది;

ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ -2 పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్షలు నిర్వహించిన వెంటనే.
తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12.15 గంటల వరకూ పరీక్షలను నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన మూల్యాంకనం ఏప్రిల్ 19 నాటికి పూర్తి చేసి, ప్రొగ్రెస్ కార్డులను 21వ తేదీన ఇస్తామని ప్రాధమిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. మళ్లీ వేసవి సెలవులు రాకముందే ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే విధంగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.