తిరుపతి రూరల్ ఎంపీపీ వైసీపీ కైవసం
తిరుపతి రూరల్ ఎంపీపీ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది.;

తిరుపతి రూరల్ ఎంపీపీ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ఎంపీలు అధికంగా ఉండటంతో పాటు అందరూ హాజరు కావడంతో అధికారులు వైసీపీ ప్రకటించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. టీడీపీ ఎంపీటీసీలు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. తిరుపతి రూరల్ ఎంపీపీగా పేరూరు ఎంపీటీసీ చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రామకుప్పం నియోజకవర్గంలో...
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న రామకుప్పం ఎంపీపీ పదవికి మాత్రం టీడీపీ ఎంపీటీసీలు ఏడుగురు హాజరయ్యారు. వైసీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. వారు ఈ ఎన్నికకు సకాలంలో వస్తే ఎన్నికలో వైసీపీ గెలుస్తుంది. లేకపోతే టీడీపీ అభ్యర్థిని ఎంపీపీగా ప్రకటించే అవకాశముంది. కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజినమ్మఎంపీపీగా ఏకగ్రీవ ఎన్నికయ్యారు.